మోహన్ బాబు తమ్ముడు పోలీస్
Published on: Mon Nov 18, 2013 8:53AM

శ్రీవాస్ దర్శకత్వంలో మంచు కుటుంబం మొత్తం కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా". ఇందులో మోహన్ బాబు, మనోజ్, విష్ణు, వరుణ్ సందేశ్, తనీష్ లు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. మనోజ్ ఈ చిత్రంలో కనిపించబోయే పోలీస్ గెటప్ ఇదే. రవీనా టాండన్, ప్రణీత, హన్సికలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లలో మంచు విష్ణు, మనోజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


