హాలీవుడ్ సీతగా మంచు లక్ష్మీ
posted on: Feb 8, 2014 10:35AM

మంచు లక్ష్మీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆమె తెలుగు. బ్రిటిష్ వాళ్ళు మన తెలుగు నేర్చుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది లక్ష్మీ తెలుగు. లక్ష్మీ తెలుగులో ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. అలాంటి ఈ అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది. "బాస్మతి బ్లూస్" పేరుతో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది లక్ష్మీ. ఓ శాస్త్రవేత్త బియ్యం తయారు చేసి, దాని వ్యాపారం నిమిత్తం ఇండియా రావడం, ఇక్కడి అమ్మాయితో ప్రేమలో పడటం తదితర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా లక్ష్మీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.






