TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు..

Published on: Wed Dec 7, 2022 2:45PM

వీర భక్తితో వింత వింత మొక్కులు మొక్కుకునే వారు చాలా మందే ఉంటారు. రాజకీయ నాయకులు యాగాలు చేస్తారు. ప్రజల సొమ్ముతో.. దేవతలకు, దేవుళ్లకు భారీ కానుకలు సమర్పించుకుంటామనీ మొక్కుకుంటారు. అయితే మొక్కులన్నీ ఒకలా ఉండవు. కొన్ని మొక్కులు తీర్చుకోవడానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది.

కొన్ని మొక్కులు మొక్కుకున్న వారిని చిక్కుల్లో పడేస్తుంటాయి. దేవుడి ఆగ్రహానికి గురౌతామన్న భయంతో మొక్కులు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంటారు కొందరు. అయితే అవన్నీ ఒకెత్తయితే.. గుజరాత్ లో ఓ వ్యక్తి మొక్కు చెల్లించుకుంటూ పడిన ఇబ్బందులు మత్రం నెట్టింట నవ్వులు పూయించాయి.

ఎరక్కపోయి మొక్కుకున్నావు.. ఇరుక్కు పోయావు బ్రో అంటూ నెటిజన్లు తెగ జోకులు పేలుస్తున్నారు. ఇంత కీ విషయం ఏమిటంటే.. గుజరాత్ లోని ఓ ఆలయంలో చిన్న సైజు ఏనుగు విగ్రహం ఉంది. తన కోరిక తీరిస్తే ఆ ఏనుగు విగ్రహం కింద నుంచి పాక్కుంటూ వస్తానని మొక్కుకున్నాడో వ్యక్తి. సరే కోరిన కోరిక తీరిందో ఏమో.. మొక్కు తీర్చుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే ఆ ఏనుగు విగ్రహం కింద నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆ విగ్రహం కింద ఇరుక్కు పోయారు. సంగం వరకూ విగ్రహం కింద నుంచి బయటకు వచ్చిన ఆయన కింది భాగం మాత్రం విగ్రహం కింద ఇరుక్కు పోయింద. బయటకు రావడానికి అవకాశం లేకుండా చిక్కుకుపోయాడు.