భారతీయులకు గుబులుపుట్టిస్తున్న వీడియో...
Published on: Tue Mar 7, 2017 2:20PM

ఇప్పటికే అమెరికాలో ట్రంప్ పుణ్యమా అంటూ భారతీయులపై జాత్యంకార దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారతీయులు ఎప్పుడు ఎవరు దాడి చేస్తారా అని భయంతో వణికిపోతుంటే.. ఇప్పుడు దానికి తోడు ఓ వీడియో భారతీయులను కలవరపెడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒహైయో శివార్లలోని కొలంబస్ నగర ఉద్యానవనంలో భారతీయుల కుటుంబాలపై రహస్యంగా తీసిన చిత్రాలు, దృశ్యాలు. ‘‘సేవ్‌అమెరికన్‌ఐటీజాబ్స్.ఆర్గ్’’ అనే వలసదారుల వైబ్ సైట్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఆ తరువాత వాట్సాప్, ఫేస్ బుక్ లలో వైరల్ గా మారింది. 66ఏళ్ల కంప్యూటర్ ప్రొగ్రామర్ స్టీవ్ పుషర్ అనే వ్యక్తి ఈ వీడియో పోస్ట్ చేసి.. దానికింద ‘ఇక్కడి విదేశీయుల సంఖ్యచూసి నా మతి చెదిరిపోతోంది. చూడండి అందరూ భారతీయులే. వీరు భారీ స్థాయిలో అమెరికన్ల నుంచి ఉద్యోగాలను తీసేసుకున్నారు. అమెరికాలోని పశ్చిమ-మధ్య ప్రాంతాలను దాదాపుగా ఆక్రమించారు. ఈ ఉద్యానవనం మినీ ముంబయిలా కనిపిస్తోంది’అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియో ఆయన గత ఏడాది ఆగష్టులో పోస్ట్ చేయగా... ఇప్పుడు ప్రస్తుత పరిణామాల మధ్య బయటకు రావడంతో ఆందోళన చెందుతున్నారు.


