TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లేడీ గెటప్ లో... మహిళను చంపిన వ్యక్తి...

Published on: Tue Jun 15, 2021 6:20PM

సినిమాలు కథకు అనుకూలంగా తమ భాషా, వేషధారణ మార్చుకుంటారు.. ఆ కథలో పాత్రను అద్భుతంగా పండిస్తారు.. ఇంకొంత మంది పొట్ట కూటికోసం రకరకాల వేశారు వేస్తారు.. కొంత మంది ఎదుటి వాళ్ళను నవ్వించడానికి వేషాలు వేస్తారు.. ఇలా ఈ సమాజం లో ఒక్కక్కరు ఎవరి వారి అవసరాలను బట్టి వారు ఆయా వేషాలు వేస్తారు. కానీ తాజాగా ఒక మగాడు ఒక మహిళను చపడానికి వేషం వేసుకున్నాడు.. అది ఏం వేషం అనుకుంటున్నారా..? అయితే ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఐతే మీరు చూడండి తెలుస్తుంది..               

అతడి పేరు నేత్రం.. అతని ఇంటి పక్కన ఉన్న ఓ వితంతువు. ఇద్దరు పిల్లలు, చెల్లెలు ఉన్నారు. ఆమె పై ఇతను గత ఏడాది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నేత్రమ్ ను అరెస్ట్ చేశారు. కొంతకాలం కిందటే అతడు బెయిల్ పై బయటికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు. అందుకు సినిమా రేంజ్ లో ప్లాన్ వేశాడు. 

గత రాత్రి ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ మహిళ వేషంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన నేత్రమ్... నిద్రిస్తున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిపైనా దాడి చేశాడు. అనంతరం అక్కడ్నించి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన బాధితురాలు మరణించింది. పోలీసులు నేత్రమ్ కోసం తీవ్రంగా గాలించి, సోమవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సిరోహి జిల్లా జిల్లాలో చోటు చేసుకుంది.