ఒక్క బైక్.. 63,500 ఫైన్.!!

ఒక్క బైక్ కి 63,500 ఫైనా!!.. భరత్ అనే నేను సినిమాలో హీరో మహేష్ బాబు లాగా ఫైన్ లు వేసినా అంత కాదుగా అనుకుంటున్నారా?.. అలా అనుకుంటే మీరు పప్పు, రసం, సాంబార్ అన్నింట్లో కాలేసినట్టే.. 'ఒక్క బైక్.. 63,500 ఫైన్' ఈ అద్భుతం కర్ణాటకలో జరిగింది.. కర్ణాటకలోని మైసూరు నగర ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. మధుప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన హోండా ఆక్టీవా బైక్ ను గుర్తించారు.

 

 

ఆ బైక్ నెంబర్ ను ఎలక్ట్రానిక్ డివైస్ లో ఎంటర్ చేయగా.. పోలీసులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.. 635 సార్లు ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా బైక్ నడిపినట్టు ఉంది.. దీనికి ఫైన్ సుమారు 63,500 రూపాయలు అయినట్టు తెలుస్తోంది.. అంత ఫైన్ అసలు ఎవరైనా కడతారా?.. ఆ బైక్ అమ్మినా అంత డబ్బు రాదు.. దానికంటే కొత్త బైక్ కొనుక్కోవడం నయం అంటారా.. సరిగ్గా బైక్ ఓనర్ కూడా ఇలాగే ఆలోచించాడు.. బైక్ వదిలేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు.. ఇప్పుడు అసలు కష్టం పోలీసులకు వచ్చి పడింది.. బైక్ అమ్మినా అంత డబ్బులు రావని తెల్సి తలలు పట్టుకుంటున్నారు.. అలా అని ఫైన్ వదల్లేరు.. అందుకే అతని నుండి ఎలాగైనా ఫైన్ రాబట్టాలని మార్గాలు అన్వేషిస్తున్నారట.. చూద్దాం ఏం జరుగుతుందో.