తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇస్తే ఫైన్ కట్టాల్సిందే!!
Published on: Tue Jun 26, 2018 4:03PM

బైక్ మీద లేదా కారులో వెళ్తుంటే, రోడ్ మీద ఎవరైనా లిఫ్ట్ అడగటం చూస్తుంటాం.. ఎవరో ఒకరిద్దరు సాయం చేద్దాం అనే ఉద్దేశంతో లిఫ్ట్ ఇస్తుంటారు.. అయితే లిఫ్ట్ ఇచ్చినందుకు చెవులతో థాంక్స్ అనే మాట వినడం కామన్, కానీ లిఫ్ట్ ఇచ్చినందుకు చేతులతో ఫైన్ కట్టడం ఎప్పుడైనా చూసారా?.. లిఫ్ట్ ఇస్తే ఫైన్ ఎందుకు కట్టాలి అంటారా.. నిజం ఒక వ్యక్తి లిఫ్ట్ ఇచ్చినందుకు 1500 ఫైన్ కట్టాడు.. ముంబైకి చెందిన నితిన్ నాయర్ తన కారులో ఇంటికి బయల్దేరాడు.. ఐరోల్ సర్కిల్ దగ్గరకు రాగానే జోరున వాన కురుస్తోంది.. ఎదురుగా బస్టాండ్‌లో ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.. వారిని చూసి జాలి వేయడంతో నితిన్ తన కారులో ఎక్కించుకున్నాడు.
ఈ సీన్ మొత్తాన్ని చూసిన ఓ కానిస్టేబుల్ నేరుగా కారు దగ్గరకు వచ్చాడు.. చలానా రాసి చేతిలో పెట్టి, ఫైన్ కట్టాలని చెప్పడంతో నితిన్ షాకయ్యాడు.. ఆ కానిస్టేబుల్ నితిన్ లైసెన్స్ కూడా తీసుకొని మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు రావాలన్నాడు.. మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. వారు కోర్టుకు హాజరుకావాలని చెప్పారు.. అక్కడ జడ్జి ముందు హాజరుకాగా, రూ.1500 ఫైన్ కట్టించి లైసెన్స్ అప్పగించారు.. తర్వాత ఆరా తీసిన నితిన్‌కు ఓ విషయం తెలిసింది.. మోటార్ వెహికల్ చట్టంలోని 66/192 ప్రకారం తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమట.. అందుకే జరిమానా విధించారట.. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.. తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం కూడా నేరమేనా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.


