మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఏమయ్యిందంటే?
Published on: Mon Dec 19, 2022 10:56AM
పెళ్లి విందులో విషాదం చోటు చేసుకుంది. పందిట్లో పెళ్లి జరుగుతోంది. పక్కనే పెళ్లి విందు. అందరూ ఆనందంగా ఉన్నారు. పెళ్లి పందిరంతా కళకళలాడుతోంది. అంతలోనే విషాదం. విందారగిస్తున్న ఓ ఆహుతుడు కుప్పకూలిపోయాడు. అంతలోనే మరణించాడు.
ఇంతకూ అతడు ఎందుకు మరణించాడంటే విందారగిస్తుండగా ఆయన ఇష్టంగా తింటున్న మటన్ ముక్క గొంతులో ఇరుక్కు పోయింది. దీంతో ఉక్కిరిబిక్కిరై కన్నుమూశాడు. ఈ విషాద ఘటన నిజామామాద్ జిల్లా నవీపేట మండలంలో జరిగింది.
పెళ్లి విందారగిస్తున్న రమణాగౌడ్ అనే వ్యక్తి గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. ఉక్కిరిబిక్కిరై కుప్పకూలిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మరణించినట్లు నిర్దారించారు. దీంతో పెళ్లింట విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.


