పోలీసు అత్యుత్సాహం తో పోయిన ప్రాణం
Published on: Fri Apr 10, 2020 5:58PM
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం లో కానిస్టేబుల్ అత్యుత్సాహం వల్ల రాయపూడి లో ఓ వ్యక్తి మృతి చెందాడు. లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామంలో రోడ్లపై తిరుగుతున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతానికి వెళ్లిన పొలీసులను చూసి, గ్రామస్తులు పొలాల్లో కి పరుగు తీశారు. గ్రామస్తులు. పొలాల్లో గ్రామస్తుల వెంట పడ్డ రామయ్య అనే కానిస్టేబుల్. పోలీసులు వస్తున్నారన్న భయంతో పొలాల్లోకి పరుగు తీస్తూ ,క్రిందపడి చనిపోయిన షేక్.జాఫర్ (55). జాఫర్ గత కొంత కాలంగా గుండె జబ్బుతో ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ భయపడటం వాలే వల్లే జాఫర్ చనిపోయాడని తెలిపిన తోటి సహచరులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తుళ్ళూరు సీఐ శరత్ బాబు చెప్పారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహం అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


