బస్సు దిగుతూ వ్యక్తి మృతి
Published on: Mon Sep 1, 2014 1:46PM
.jpg)
హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. గతుకుల మయమైపోయిన రహదారి ఒక వ్యక్తి ప్రాణాలను బలగొంది. హైదరాబాద్‌లోని బేగంపేట ఆనంద్ థియేటర్ వద్ద ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సు నుంచి దిగుతూ రోడ్డు మీద వున్న గుంతలో కాలు పడటంతో జారి పడిపోయారు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన కారణంగా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.


