TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళ డ్రెస్సును పైకి లేపిన సైకో అరెస్ట్

Published on: Sun May 24, 2026 10:40AM

 

అల్కాపూర్ టౌన్‌షిప్‌లో మహిళపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో బాధితురాలు తన రెండున్నరేళ్ల చిన్నారిని సమీప ప్లే స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి వెళ్తుండగా, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెను వెంబడించాడు. 

అనంతరం వెనుక నుంచి వచ్చి ఆమె దుస్తులను పైకి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు కేకలు వేయగా, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.ఈ ఘటనపై బాధితురాలు 19వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో నిందితుడు వడ్డే నాగరాజు (26)గా గుర్తించారు. అతను ప్రస్తుతం గండిపేట మండలం పుప్పాలగూడలో నివాసం ఉంటుండగా, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం చాకలిపల్లి గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.నిందితుడికి గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇలాంటి ఘటనల్లో ఇంతకు ముందు పాల్గొన్న ఆనవాళ్లు లేవని నార్సింగి ఎస్‌హెచ్‌ఓ హరికృష్ణ రెడ్డి తెలిపారు