TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తలకి హెన్నా రాసుకున్నాడు.. అరెస్ట్ అయ్యాడు.!!

Published on: Fri Jul 6, 2018 1:48PM

 

అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది అన్నట్టు.. శని తల మీద కూర్చుంటే తలకి హెన్నా రాసుకున్నా, అరెస్ట్ అవుతారు.. 'హెన్నా రాసుకుంటే అరెస్ట్ అవ్వడం' వినడానికి వింతగా ఉన్నా అసలు సంగతి తెలిస్తే అవాక్కు అవుతారు.. మీరట్ లో ఎస్.ఐ ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు.. ఈ ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై కావాలంటే అభ్యర్థి కనీసం 168 సె.మీ ఎత్తు ఉండాలి.. పాపం అంకిత్ కుమార్ అనే యువకుడు ఒకే ఒక్క సెంటీమీటర్ తక్కువున్నాడు.. రాతపరీక్షలో క్వాలిఫై అయ్యి కూడా, కేవలం ఒక్క సెంటీమీటర్ ఎత్తు తక్కువున్న కారణంగా ఎస్.ఐ ఉద్యోగం కలగా మిగిలిపోవడం అంకిత్ కి నచ్చలేదు..

అందుకే ఆ ఒక్క సెంటీమీటర్ ఎత్తు పెరగాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు.. కానీ లాభం లేదు.. చివరికి అతనికి ఒక ఐడియా వచ్చింది.. ఆ ఐడియా తన జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాడు.. హెన్నా తలకి రాసాడు.. దువ్వెనతో జుట్టు పైకి దువ్వి, ఫిజికల్ టెస్ట్ కి వెళ్ళాడు.. కానీ అక్కడుంది ఎవరు? పోలీసులు.. పోలీస్ అవుదామనుకొని పోలీసుల్నే బురిడీ కొట్టిద్దాం అనుకుంటే ఎలా.. పోలీసులు అతన్ని పట్టుకున్నారు, ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేసారు.. అలా తలకి హెన్నా రాసుకొని ఎస్.ఐ అవుదామనుకున్న అంకిత్ కాస్తా, అరెస్ట్ అయ్యాడు.