TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కౌంటిగ్ కేంద్రాల వద్ద అక్రమాలు.. ఎణ్నికల సంఘం తీరూ అనుమానాస్పదం.. మమత

Published on: Mon May 4, 2026 8:17AM

ఓట్ల లెక్కింపు వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో హీట్ పతాక స్థాయికి చేరుకుంది. బీజేపీ, టీఎంసీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యల అనంతరం.. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందన్నారు. కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ..  ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.  కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా బీజేపీ వ్యవహరిస్తోందని, దీనిని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. 

ఈ క్రమంలోనే  ఫలితాల ప్రక్రియ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండి..  ప్రతి ఓటును నిశితంగా గమనించాలని ఆమె తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏవైనా అక్రమాలు జరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలని, అవసరమైతే పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలకు వెనుకా డబోమని హెచ్చరించారు. ఇలా ఉండగా.. ఓటమి భయంతోనే ఆమె ఇలాంటి ముందస్తు ఆరోపణలు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.