మోడీ సభలో గాయం.. మమత సాయం.

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మీద విధాన పరమైన శత్రుత్వం ఉండటం కామన్.. ఆ శత్రుత్వాన్ని,కోపాన్ని సామాన్య ప్రజలు,కార్యకర్తల మీద చూపకూడదు.. ఇదే సిద్ధాంతాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నమ్ముతారని అర్ధమవుతుంది.

 

 

ఈ నెల 16న ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తుండగా.. సభ ప్రధాన ద్వారం వద్ద వేసిన తాత్కాలిక టెంట్ కొంతమేర కుప్పకూలింది.. దీంతో 90 మందికి పైగా గాయపడ్డారు.. వెంటనే ప్రసంగం నిలిపివేసిన మోదీ తన పక్కనే ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి.. గాయపడిన వారికి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన మమతా బెనర్జీ, బహిరంగ సభలో గాయపడిన బాధితులందరికీ ప్రభుత్వం తరుపున పూర్తి వైద్య సహాయం అందిస్తామని పేర్కొన్నారు.. రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ, ప్రత్యర్థి పార్టీ బీజేపీల మధ్య తీవ్ర విబేధాలు కొనసాగుతున్నప్పటికీ.. మమతా బెనర్జీ వాటన్నిటినీ పక్కన బెట్టి బాధితులను పరామర్శించి తన ప్రత్యేకత చాటుకున్నారు.