TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబును ప్రశంసిస్తూ మమతా ట్వీట్...

Published on: Sun Mar 25, 2018 12:35PM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశంసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసలు కురిపించారు.కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని ఆమె కితాబిచ్చారు. అసత్యాలు ప్రచారం చేసే నాయకులు చాలామంది ఉన్నారని, అది వారికి అలవాటుగా మారిందని...చంద్రబాబు నాయుడు నిజాలు బయటపెడుతున్నందుకు అభినందిస్తున్నానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. చాలామంది సోకాల్డ్ నేతలు అబద్దాలు చెబుతున్నారని... అది అలవాటుగా మార్చుకున్నారన్నారు. తాము రాష్ట్రాలకు పెద్ద  ఎత్తున నిధులు ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రాలను బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మమతా బెనర్జీ ఆగ్రహించారు.