రాహుల్ కు చెప్పినా వినలేదు..

 

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా ఎన్నికల్లో బీజేపీ విజయపతాకం ఎగరేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఎన్నికల్లో ముందుగానే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను ఎంతగానో చెప్పానని, పొత్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కాంగ్రెస్ వైఫల్యం చెందిందని, అదే ఎత్తుగడతో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరి మాట వింటారో అర్థం కావట్లేదని, సొంత తప్పుల కారణంగానే ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతోందని అన్నారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీకి స్వర్ణయుగం వచ్చినట్టేనని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించి మండిపడ్డారు. నెమలి పింఛాలను పెట్టుకున్న బొద్దింకలు, తాము నెమ్మళ్లైపోయినట్టు కలగంటున్నాయని, వారి కలలను 2019 పార్లమెంట్ ఎన్నికలు కల్లలుగా మారుస్తాయని అన్నారు.