మల్లారెడ్డి డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పూలబాల వెంకట్ నియామకం
Published on: Mon Jul 13, 2026 10:56AM

బహుభాషా కోవిదుడు, మాతృభాషా శిరోమణి బిరుదాంకితుడు పూలబాల వెంకట్‌కు మల్లారెడ్డి డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా నియామకం లభించింది.ఈ నెల 24వ తేదీన పూలబాల వెంకట్ రచించిన "పోలిగ్లాటిజం" అనే ఆరు భాషలను నేర్పించే పుస్తకాన్ని ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ యువరాజు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.
పూలబాల వెంకట్ బహుభాషా నిపుణుడిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలందించడంతో పాటు, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా విదేశీ భాషలను బోధించి అనేక మంది విద్యార్థులను పోలిగ్లాట్లుగా తీర్చిదిద్దారు. అలాగే ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాల్లో ఆరు భాషల్లో మాట్లాడే విశేష ప్రతిభను ప్రదర్శించారు. భాషా బోధన, సాహిత్య రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలు, ప్రతిభను గుర్తించి ఈ నియామకం చేపట్టినట్లు నియామక పత్రంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ యువరాజు పేర్కొన్నారు.


