మీడియా పాయింట్‌లో మల్లాదికి చుక్కెదురు
Published on: Mon Oct 8, 2012 2:53PM
మల్లాది విష్ణు, జోగి రమేశ్, శ్రీనివాస్ ఎమ్మెల్యేలకు శుక్రవారం సెక్రటేరియట్‌లో చుక్కెదురయింది. ఈ ముగ్గురూ మీడియా లాంజ్‌లో విలేకరులతో మాట్లాడారు. లగడపాటి రాజగోపాల్‌ను విమర్శించడం సహించమని, తగిన బుద్ధి చెబుతామని అన్నారు. డిసెంబర్ తొమ్మిదోతేదీన మీరే ఈ వివాదాన్ని ప్రారంభించారు? కదా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు వారు సమాధానం చెబుతూ, సమైక్యాంధ్రను సమర్థిస్తూ మాట్లాడారు. అయితే అక్కడికి వచ్చిన ఒక ముస్లిం తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని సహించలేదు. అసలు తెలంగాణలో ఉండి మీరిలా మాట్లాడి బయటకు పోతారా? అంటూ వివాదానికి దిగే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. అయితే పక్కనే ఉన్న మీడియా మిత్రులు సెక్రటేరియట్‌లో గొడవ పడకూడదంలూ అతనిని పంపించివేశారు.


