మల్లాదికి బెయిల్ మంజూరు..
Published on: Fri Jan 22, 2016 5:34PM

కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరు అయింది. రూ.50వేల చొప్పున పూచీకత్తులతో విజయవాడలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అతనితో పాటు అతని సోదరుడు మల్లాది శ్రీనివాస రావుకు కూడా కోర్టు బెయిలు ఇచ్చింది. కాకపోతే ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి మూడు రోజులు పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని, సిట్ విచారణకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది


