మల్లాదిపై సిట్ పిటిషన్.. సహకరించలేదు..
Published on: Tue Jan 12, 2016 12:08PM

కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణువు.. ఆయన సోదరుడు శ్రీనివాస్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరిని పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ బృందం మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. తాము రెండు రోజుల పాటు విచారించినా మల్లాది తమకు సహకరించలేదని.. మరో ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. మరోవైపు మల్లాది విష్ణు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.


