TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మల్లాది విష్ణు అరెస్ట్ తో కాంగ్రెస్ లో విబేధాలు..?

Published on: Sat Jan 9, 2016 3:30PM

కల్తీ మద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణువు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో విజయవాడ కాంగ్రెస్ వర్గాల మధ్య విభేధాలు తలెత్తున్నట్టు కనిపిస్తుంది. మల్లాది విష్ణువును అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని అనుచరులు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ, సి. రామచంద్రయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో బలమైన నేతగా ఎదుగుతున్న మల్లాది విష్ణుపై కుట్రపూరితంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారని రఘువీరా, కేవీపీని విష్ణు వర్గీయులు నిలదీశారు. దీంతో రఘువీరా అనుచరలకు.. మల్లాది అనుచరులకు మధ్య వివాదాలు తలెత్తాయి. పార్టీ సీనియర్లను మల్లాది విష్ణు వర్గీయులు రత్నభవన్‌లోనే బంధించారు.

ఇదిలా ఉండగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజయవాడ సబ్‌జైలులో విష్ణును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే మల్లాది విష్ణును వేధిస్తున్నారని..పార్టీ తరపున ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.