అజ్ఞాతం వీడిన మల్లాది విష్ణు..!
Published on: Tue Jan 5, 2016 10:42AM
(1).jpg)
కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత నెల రోజుల నుండి అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అజ్ఞాతం వీడినట్టు తెలుస్తోంది. అజ్ఞాతం వీడిన ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ అయినట్టు సమాచారం. కాగా మల్లాది విష్ణు రేపు కృష్ణలంక పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా మల్లాది విష్ణు ముందస్తు బెయిన్ ను కోర్టు నిన్న డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రేపు సిట్ అధికారుల ముందు తప్పనిసరిగా హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటీసులను మల్దాది విష్ణు తరపు న్యాయవాదులకు అందించింది.


