TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ కార్యాలయానికి ప్రీతి రెడ్డి... పార్టీలో చేరికపై క్లారిటీ!

Published on: Fri Apr 24, 2026 3:09PM

 

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆమె బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలుసుకున్నారు. అయితే ఈ భేటీ నేపథ్యంలో బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. ఈ ప్రచారంపై ప్రీతి రెడ్డి స్పందిస్తూ తాను భారతీయ జనతా పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నానని తెలిపారు. 

ఏఐసిటి యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను ఆహ్వానిం చేందుకు బీజేపీ నాయకులను కలిసినట్టు చెప్పారు. అదేవిధంగా, మాజీ మంత్రి మల్లారెడ్డి భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నారని, పార్టీ మార్పు అంశం అసత్యమని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సౌహార్ద పూర్వకంగా సమావేశాలు కొనసాగిస్తున్నానని ఆమె వెల్లడించారు. ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది