TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ‌ధువు కావ‌లెను.. వ‌రుడు హోర్డింగ్‌....

Published on: Mon Jan 10, 2022 2:15PM

ఆ వ‌రుడికో వ‌ధువు కావ‌లెను. త‌న‌కు అన్నిఅర్హ‌త‌లు ఉన్నాయ‌ని.. అయినా అమ్మాయి దొర‌క‌డం లేద‌ని తెగ ఫీల్ అవుతున్నాడు. అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి త‌న‌ను త‌ప్పించ‌మ‌ని.. మంచి వ‌ధువును చూసి పెట్ట‌మ‌ని వేడుకుంటున్నారు. ఆ వేడుకోవ‌డం కూడా ఏ తెలిసిన వారినో.. క‌నిపించిన వారినో కాదు.. పేప‌ర్ ప్ర‌క‌ట‌నలాంటివి కూడా కాదు. ఏకంగా.. ఓ ర‌ద్దీ జంక్ష‌న్‌లో పెద్ద సైజు హోర్డింగ్ పెట్టి మ‌రీ త‌న‌కో అమ్మాయి కావ‌లెను అంటూ యాడ్ ఇచ్చాడు అత‌గాడు. అత‌ను పెట్టిన ఆ యాడ్ ఇప్పుడు బ్రిట‌న్‌లో, సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే...

పాకిస్తాన్ జాతీయుడైన మహమ్మద్ మాలిక్ బ్రిటన్ లో ఉంటున్నాడు. 'నాకు ఒక సరి జోడు చూసి పెట్టండి' అంటూ లండ‌న్ బ‌ర్మింగ్‌హ‌మ్ సిటీలో ఓ హోర్డింగ్ పెట్టించాడు. ఆ హోర్డింగ్ చూసిన వాళ్లంతా మొద‌ట ఏదో కామిడీకి చేసుంటాడ‌ని అనుకున్నా.. అది నిజ‌మేన‌ని తెలిసి ఆ త‌ర్వాత అవాక్క‌వుతున్నారు. 

త‌న పూర్తి వివ‌రాల‌తో ఓ వెబ్‌సైట్ క్రియేట్ చేశాడు మాలిక్‌. ఆ సైట్ ఓపెన్ చేయ‌గానే.. 'ఇది జోక్ కాదండోయ్.. నాకు ఓ వధువును వెతికి పెట్టండి' అనే టైటిల్‌తో సైట్‌లో పెద్ద హెడ్డింగ్ పెట్టాడు. 'పెళ్లి చేసుకోవడానికి ఇప్పటివరకు నాకు సరైన అమ్మాయి దొరకలేదు. అమ్మాయిని వెతకడం చాలా కష్టంగా మారింది. చాలా యాప్ లో ప్రకటనలు ఇచ్చాను. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నా వివరాలు అన్నీ పొందు పర్చాను. కానీ నాకు అమ్మాయి దొరకలేదు. చివరకు నా ఫ్రెండ్ సాయంతో ఈ బిల్ హోర్డింగ్ పెట్టాను.' అని పోస్ట్ చేశారు.

త‌న హోర్డింగ్‌కు మాంచి రెస్పాన్స్ వ‌స్తోందంటున్నాడు మాలిక్‌. చాలా మంది యువతుల వివరాలు వచ్చాయని చెబుతున్నాడు. అయితే, వాటన్నిటినీ పరిశీలించే సమయం ఉండ‌టం లేద‌ని అంటున్నాడు.