TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ లో మేల్ ప్రాస్టిట్యూట్ దందా

Published on: Wed Nov 7, 2012 1:55PM

Male prostitute rocket, male prostitutes, male sex workers, call boys, male sex network, male call lists, Hyderabad sex rocket, Hyderabad sex

 

హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం రాకెట్ మూడు పూలూ ఆరుకాయలుగా సాగుతోంది. డబ్బుపారేసి సుఖాన్ని కొనుక్కునే పురుష పుంగవుల స్థానంలో ఇప్పుడు మహిళలు కూడా పెరిగిపోయారు. అబ్బాయిలకు డబ్బులిచ్చి సుఖాన్ని కోరుకునే ఆడవాళ్ల సంఖ్య బాగా ఎక్కువై పోయింది. కాల్ బాయ్స్ సంస్కృతి రాజధానిలో విపరీతంగా పెరిగిపోతోంది.

 

గంటకో రేటు, పూటకో రేటు చొప్పున కాల్ బాయ్స్ చార్జ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కాల్ బాయ్స్ గా పనిచేస్తున్నవాళ్లలో ఎక్కువ శాతం మంది బాగా డబ్బున్నవాళ్ల పిల్లలే ఉండడం. సుఖానికి సుఖం, జల్సాలు చేసుకోవడానికి డబ్బుకూడా వస్తాయన్న ఆశతో కుర్రాళ్లు ఈ విష సంస్కృతికి అలవాటుపడుతున్నారు.

 

విషయం ఎక్కడా బైటికి పొక్కకుండా సీక్రెట్ గా ఉంచుతాడన్న నమ్మకాన్ని కలిగించగలిగిన కాల్ బాయ్స్ కి కాసులపంట పండుతోందని విచారణలో తేలింది. ఇంటర్ నెట్ లో సోషల్ సైట్స్, ఫ్రెండ్ నెట్ వర్క్ ల ఆధారంగా మేల్ ప్రాస్టిట్యూషన్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది.