TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గణపతి సచ్చిదానంద స్వామీజీకి అస్వస్తత

Published on: Sat Mar 10, 2012 10:11AM

మైసూరు: మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ అస్వస్తతకు గురయినట్లు తెలిసింది. ఆంధ్రాప్రాంతంలో ఆయన పర్యటించిన తరువాత బాగా అలసిపోయారు. మైసూరులో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హృద్రోగ సంబంధ సమస్య రావడంతో హుటాహుటిన స్వామీజీని ఢిల్లీ తీసుకెళ్ళారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు జరిపారు. సమస్య తీవ్రంగా కాకుండా ఉండేందుకు వైద్యులు కొన్ని రకాల మందులు సూచించారు. ఆయన మైసూరులో ఉన్న సమయంలో మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన కధనాలతో స్వామీజీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఆయన వారసుడు చిన్నస్వామి నిర్వహిస్తున్నారు. త్వరలో సచ్చిదానంద స్వామి జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. అప్పటికల్లా స్వామివారు పూర్తిగా కోలుకోవాలని భక్తులు ప్రార్ధిస్తున్నారు.