TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టుల వద్ద ప్రమాదకర పేలుడు పదార్దాలు?

Published on: Mon Feb 20, 2012 2:44PM

వరంగల్ : మావోయిస్టులు అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన పేలుడు పదార్దాలను సమకూర్చుకుంటున్నారా? ఇటీవల వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం లో పోలీసులు వెలికి తీసిన మందుపాతరలు పరిశీలిస్తే ఔననే అనిపిస్తోంది. ఏజెన్సీలో పట్టు పెంచుకునే దిశగా మావోయిస్టులు కొత్త వ్యూహాలతో కదులుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడ మండలం గంగారం అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనంచేసుకున్న పేలుడు పదార్ధాన్ని ట్రై నైట్రోటాల్యూన్ (టిఎన్టి)గా అనుమానిస్తున్నారు. స్పటిక, లేత పసుపురంగులో ఉన్న ఈ పేలుడు పదార్దాన్ని ల్యాబ్ కు పంపారు. నివేదిక వస్తే అది టిఎన్టియా లేదా అంతకంటే ప్రమాదకరమైన పేలుడు పదార్దమా అనేది తెలుస్తుంది. టిఎన్టి అతి తక్కువ మోతాదులో ఉన్నా భారీ పేలుడు సంభవిస్తుందని పోలీసులు చెబుతున్నారు. దీని రవాణా కూడా తేలికని, కిట్ బ్యాగ్ లో తీసుకెళ్ళి అవసరమైనప్పుడు కేవలం పది నిమిషాల్లో మందుపాతరగా వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు.