TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహీ మహిమ.. రైతు అవతారంలో అభిమానుల హృదయాలు దోచాడు

Published on: Thu Feb 9, 2023 10:57AM

మహేంద్రసింగ్ ధోనీ.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్. తన సారథ్యంలో దేశానికి మూడు ప్రపంచ కప్ లు సాధించి పెట్టాడు. ఐపీఎల్ లో కూడా చెన్నై సారథిగా తనదైన కెప్టెన్సీతో అత్యధిక సార్లు టైటిల్ విజేతగా జట్టును నిలిపాడు. మైదానంలో అయినా, బయట అయినా ధోనీ స్టైల్ సెపరేట్ అన్నట్లుగా అతని తీరు ఉంటుంది. బైక్ లు అంటే అమితంగా ఇష్టపడతాడు. ధోనీకి ఉన్నన్ని బైక్ లు మరెవరికీ ఉండవంటే అతివయోక్తి కాదు.

ఇవన్నీ కాకుండా క్రికెట్ లోని మూడు  ఫార్మట్లలోనూ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కు సారథిగా ఉన్న ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తరువాత తీరిక వేళల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మిస్టర్ కూల్ గా అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ధోనీ.. విరామంలో వ్యవసాయదారుడిగా మారి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.

తాజాగా ట్రాక్టర్ తో ధోనీ పొలంలో దుక్కిదున్నుతున్న ఫోటో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఆయన ఈ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల మంది లైక్ చేశారు. వేల మంది షేర్ చేశారు.