TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహేశ్వరం టీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా తీగల??

Published on: Wed Jul 19, 2023 1:56PM

మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హైదరాబాద్ మేయర్ తీగల కృష్ణారెడ్డి  కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఎ ఐసీసీ తెలంగాణ ఇన్ చార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
నిన్న మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయితే మహేశ్వరం నియోజనవర్గం టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని తీగల కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తర్వాత బిఆర్ ఎస్ లో చేరారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నియోజకవర్గం పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు. 2014లో ఇదే మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగా రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మల్ రెడ్డి రంగా రెడ్డి కూడా ఉన్నారు. రంగా రెడ్డి జిల్లాలోని మీర్ పేట నుంచి తీగల రాజకీయ జీవితం టీడీపీ నుంచి ప్రారంభమైంది. హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గాంధీనగర్ డివిజన్ నుంచి కార్పోరేట్ గా గెలుపొంది హైద్రాబాద్ మేయర్ అయ్యారు. మేయర్ గా మంచి గుర్తింపు సంపాదించారు.