గౌతమ్ కూడా మొదలెట్టేశాడు

posted on: Jan 24, 2014 2:37PM

 

మహేష్ నటించిన "1" చిత్రం ఇటీవలే విడుదలైన విషయం అందరికి తెలిసిందే. అభిమానుల అంచనాలను అందుకొని "1" సినిమా మొదటి నుంచే డివైడ్ టాక్ ను సంపాదించుకొని, సినిమా ఫ్లాప్ బాటలో నడుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ చిన్నతనం పాత్రలో నటించిన గౌతమ్ ఒక రైమ్ పడుతుంటాడు. ఆ పాటను పిల్లల సమక్షంలో గౌతమ్ ముఖ్య అతిధిగా విచ్చేసి, విడుదల చేసాడు. ఈ కార్యక్రమంలో నిర్మాతలతో పాటు గౌతమ్ తల్లి నమ్రత కూడా పాల్గొన్నది. సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోకపోయినా కూడా ఇందులోని ఈ పాట మాత్రం చిన్న పిల్లలకు బాగా నచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి గౌతమ్ తన వంతు ప్రయత్నంగా తన సినిమాను ఈ విధంగానైనా పబ్లిసిటీ చేస్తున్నాడనే అనుకోవచ్చు.

google-ad-img
    Related Sigment News
    • Loading...