TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహేష్ తనయుడు గౌతమ్ సినీ ఎంట్రీ !

Published on: Sun Feb 17, 2013 11:43AM

 

 

mahesh son goutham, mahesh sukumar, sukumar goutham, mahesh babu sukumar movie

 

 

లిటిల్ ప్రిన్స్ గౌతమ్ కృష్ణ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో భాగంగా గౌతమ్ పై ట్రయల్‌ షూట్‌ కూడా చేశారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్. ఇంతకి లిటిల్ ప్రిన్స్ గౌతమ్ ఏ సినిమాలో నటించబోతున్నాడు.


సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ చిన్నప్పటి పాత్ర గౌతమ్‌కృష్ణతో నటింపజేయాలని సుకుమార్ భావించారట. ఈ నిర్ణయానికి మహేష్ కూడా ఓకే చెప్పడంతో అన్నపూర్ణ స్టూడియోలో గౌతమ్ పై ట్రయల్ షూట్ చేశారు. సూపర్ స్టార్...లిటిల్ సూపర్ స్టార్ ఫస్ట్ టైం కలిసి నటిస్తుండంతో ఈ మూవీ కి భారీ క్రేజ్ రానుంది. మహేష్‌బాబు కూడా బాలనటుడిగానే తెరపైకి వచ్చారు. తండ్రి కృష్ణ నటించిన పలు చిత్రాల్లో మహేష్‌ నటించిన సంగతి తెలిసిందే. సో త్వరలో గౌతమ్ వెండితెరపై ఎన్ని వండర్స్ చేస్తాడోనని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.