TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహేష్ ను పడేసిన దోపిడీ నిర్మాతలు

Published on: Thu Dec 19, 2013 9:31AM

 

"డి ఫర్ దోపిడి" చిత్రం ద్వారా నిర్మాతలుగా పరిచయమవుతున్న రాజ్ అండ్ డి.కె.లకు మరో అద్భుత అవకాశం దక్కినట్లు తెలిసింది. వీళ్ళు నిర్మించిన "డి ఫర్ దోపిడి" చిత్రంఈనెల 25న విడుదల కానున్నది. అయితే వీరు ప్రిన్స్ మహేష్ బాబుకు ఒక కథ వినిపించారట. ఆ కథ నచ్చి వెంటనే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రాన్ని వీరిద్దరూ కలిసి డైరెక్ట్ చేయబోతున్నారట. స్క్రిప్ట్ రెడీగా ఉండడం వలన ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. అశ్వినీదత్ నిర్మించనున్నారు. మరి ఇప్పటికే మహేష్ తో సినిమా చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. మరి ఈ దోపిడీ నిర్మాతలకు ఎప్పుడు అవకాశం వస్తుందో చూడాలి.