TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీనువైట్ల కి మహేష్ వార్నింగ్!

Published on: Tue Jun 18, 2013 3:25PM

 

 Mahesh babu Srinu vytla, Srinu Vytla Mahesh Babu,  Mahesh Babu aagadu

 

 

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల కి వార్నింగ్ ఇచ్చాడట! అదేంటి శ్రీనువైట్ల కి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడమేమిటి అని అనుకుంటున్నారా! ఇది మాత్రం నిజం. త్వరలో మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకేక్కబోతున్న 'ఆగడు' సినిమా నేపధ్యంలో ఈ విషయం చోటుచేసుకుంది.

 


రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శ్రీనువైట్ల తీసిన 'బాద్ షా' కి హిట్ టాక్ వచ్చిన..చివరకు నిర్మాత నష్టాలు చూడవలసి వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే దీనికి కారణం శ్రీనువైట్లనే అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. నిర్మాతతో అనవసర ఖర్చులు ఎక్కువగా పెట్టించాడని..అందుకే సినిమాకి నష్టాలు వచ్చాయని పుకారుంది సినీ వర్గాల్లో.


ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం తన సినిమా ఖర్చు పై ముందుగానే జాగ్రతలు తీసుకుంటున్నాడు. దర్శకుడు శ్రీనువైట్లతో 'ఆగడు' ఖర్చు ఎట్టి పరిస్థితుల్లో నలబై కోట్ల కు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ కాకూడదని వార్నింగ్ ఇచ్చాడట. దీంతో ఆ సినిమా నిర్మాతలు మహేష్ ని తెగ పొగిడేస్తూ..సంబరపడిపోతున్నారు.