TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాల్వలో దూకిన మహేష్ అభిమాని

Published on: Sun Sep 14, 2014 2:02PM

 

కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరం లేదని సినీ హీరో మహేష్‌బాబు తన సినిమాలో చెప్పాడు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆయన అభిమాని అర్థం చేసుకోలేదు. అధికారులు మహేష్‌బాబు కటౌట్‌ని తీసేస్తు్న్నారని బాధపడి కాలువలో దూకేశాడు. విజయవాడలోని అలంకార్ థియేటర్ దగ్గర మహేష్ బాబు తాజా సినిమా ‘ఆగడు’ భారీ కటౌట్ పెట్టారు. ఆ కటౌట్‌ని తొలగించడానికి అధికారులు ప్రయత్నించారు. దాంతో మహేష్ అభిమానులు ఆందోళనకు దిగారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ ఒక మహేష్ బాబు అభిమాని పక్కనే వున్న ఏలూరు కాల్వలోకి దూకేశాడు. స్థానికులు కాపాడటంతో బతికి బయటపడ్డాడు.