కేటీఆర్ డైనమిక్ పర్సన్ - మహేష్ బాబు
Published on: Tue Jul 24, 2018 11:57AM
రాజకీయం,సినిమా ఈ రెండిటికి అవినాభావ సంభందం ఉంది.సినిమాలలో నటించి గొప్ప పేరు సంపాదించిన చాలా మంది రాజకీయాలవైపు అడుగులు వేశారు.అందులో కొందరు తమ సత్తా చాటుకుంటే,మరికొందరు బోల్తా పడ్డారు.అలానే సినిమాల్లో నటిస్తూ రాజకీయ నాయకులతో స్నేహబంధం ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు.. ఆ కోవకు చెందిన వారిలో మహేష్ బాబు ఒకరు.మహేష్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ కి మంచి స్నేహ బంధం ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
.jpg)
కేటీఆర్ కొంత కాలం క్రితం మహేష్ నటించిన భరత్ అనే నేను మూవీని థియేటర్‌కు వెళ్లి చూడటమే కాకుండా ఒక ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు మహేష్ బాబు..కేటీఆర్ జన్మదినం కావటంతో ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు.మహేష్ ట్విట్టర్ లో ‘‘మంచి స్నేహితుడు, గొప్ప లీడర్, డైనమిక్ పర్సన్.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేసాడు.అంతేకాకుండా కేటీఆర్‌కు బొకేను అందజేస్తున్న పిక్‌ను జత చేశాడు.తనకు విషెస్ తెలుపుతున్నవారికి కేటీఆర్ ట్విట్టర్ లో ‘మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉంది కానీ ఆదివారం సాయంత్రం నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. బహుశా వయసు రీత్యా కావొచ్చు. అందరికీ మరోసారి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసారు.


