TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్ళీ మల్టీ స్టారరా! వద్దురా బాబు అన్న మహేష్ ..!

Published on: Wed Jan 16, 2013 6:35PM

 

సీతమ్మ వాకిట్లో.. సినిమా ఇచ్చిన ఊపుతో చిన్నోడు మహేష్ బాబు మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేస్తాడని, అందరూ ఊహిస్తుంటే, “మళ్ళీ మరో మల్టీ స్టారరా! వద్దురా బాబు...వద్దు’ అంటున్నాడు మన చిన్నోడు. సీతమ్మ వాకిట్లో విజయోత్సవం జరుపుకోవడానికి విజయవాడ వచ్చిన మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ ఇంతత్వరలో మల్టీ స్టారర్ సినిమా చేయబోవట్లేదని అన్నాడు. అదేవిదంగా తానూ రాజకీయ చిత్రం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించేడు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం తానూ కష్టపడుతున్నట్లు మీడియాలో వస్తున్నవి కేవలం పుకార్లు మాత్రమే నని చెప్పాడు. బాలీవుడ్ కి పయనం ఎప్పుడనే ప్రశ్నకు సమాధానంగా తనకి ఆ ఆలోచనలేదని, తెలుగు సినిమాలకే అంకితం అవుతానని అన్నాడు. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో విజయానందాన్ని ఆస్వాదిస్తున్నానని, అందులోంచి బయట పడేందుకు కొంత సమయం పడుతుందని అన్నాడు.