హైదరాబాద్ లో మహేష్ ఆగడు
Published on: Tue Dec 3, 2013 8:47AM

"దూకుడు" చిత్రం తర్వాత మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో "ఆగడు" చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో మహేష్ మాస్ పాత్రలో అలరించానున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన"1" చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నెల 19న పాటలను విడుదల చేసి, వచ్చే నెల 10న సినిమాను విడుదల చేయబోతున్నారు.


