మహేష్ ‘ఆగడు’ ఆడియో కబుర్లు...

 

మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆగడు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఆడియోను ఈనెల 30న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని వర్గాల శ్రోతలను ఆకట్టుకునే సంగీతాన్ని ఈ సినిమా కోసం థమన్ అందించారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘ఆగడు’ సినిమాకి సంబంధించి ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా టీజర్లు కూడా ప్రేక్షకులకు ‘ఆగడు’ సినిమా మీద అంచనాలు, ఎదురుచూపులు పెంచాయి.