యూట్యూబ్‌ను దున్నేస్తున్న మహేష్
posted on: Jan 3, 2014 1:58PM

సూపర్ స్టార్ మహేష్ ''1 నేనొక్కడినే'' చిత్రం విడుదలకి ముందే రికార్డుల వేట మొదలుపెట్టాడు. నూతన సంవత్సరం కానుకగా విడుదలైన '1 నేనొక్కడినే' ట్రైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క రోజులో ఈ వీడియోకి ఐదు లక్షల క్లిక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిక్స్ 8 లక్షలు క్రాస్ చేసింది. రిలీజ్ కి ముందే రికార్డ్ లు సృష్టిస్తున్న ఒక్కడు...విడుదల తరువాత ఎన్ని సంచలనాలను నమోదు చేస్తాడో! ఈనెల 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ బాలనటుడిగా తెరంగ్రేటం చేయబోతున్నారు.







