ఎన్టీఆర్ విగ్రహల ధ్వంసం ఉద్రిక్తత
Published on: Thu Jan 26, 2012 8:19AM
రాజమం
డ్రి : మహేంద్రవాడలో మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ గుర్తుతెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు.తాము అధికారంలోకి వస్తే వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను కుల్చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ప్రభావం రాష్ట్రంలో ఇంకా కనిపిస్తూనే ఉంది. రెండు చోట్ల స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలపై దాడులు జరిగాయి. ఒక చోటు ఆయన విగ్రహానికి నిప్పు పెట్టగా, మరో చోట విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు బాధ్యులను గుర్తించి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.గుంటూరు జిల్లా చెరుకుపల్లి గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహానికి దండగులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.వారి ఆందోళన కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల నల్లగొండ జిల్లా కోదాడలో కూడా ఎన్టీ రామారావు విగ్రహంపై దాడి జరిగింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలపై కూడా దాడులు జరిగాయి.


