TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ధోనీ ఫోన్లు చోరీ..ఫోన్లలో టీమిండియా కీలక సమాచారం

Published on: Sun Mar 19, 2017 12:54PM

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫోన్లు చోరీకి గురయ్యాయి. విజయ్ హజారే ట్రోఫిలో భాగంగా ధోనితో పాటు మరికొందరు క్రికెటర్లు ఢిల్లీలోని ద్వారక హోటల్లో బస చేశారు. అయితే శుక్రవారం ఆ హోటల్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ధోనితో పాటు మిగిలిన వారందరూ హోటల్ నుంచి బయటికి వచ్చేశారు. కొద్దిసేపటి తర్వాత గదిలోకి వెళ్లిచూస్తే అక్కడ ఉంచిన మూడు సెల్‌ఫోన్లు కనిపించకుండాపోయాయి. దీంతో వెంటనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ధోని. వాటిలో టీమిండియా, బీసీసీఐకి సంబంధించి కీలక సమాచారం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.