TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఈడెన్‌లో మహేంద్రుడి సెంచరీ

Published on: Sun Feb 26, 2017 4:29PM

టెస్టులు, వన్డేలు, టీ20 కెప్టెన్‌గా వైదొలగడమే కాకుండా...ఐపీఎల్‌లో పుణే సూపర్‌ జెయింట్స్ కెప్టెన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈడెన్ గార్డెన్స్‌లో సెంచరీతో విజృంభించాడు. విజయ్ హజారే ట్రోఫిలో భాగంగా ఇవాళ ఈడెన్‌లో ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న గ్రూప్ డి మ్యాచ్‌లో జార్ఖండ్‌కు సారథ్యం వహిస్తున్న ధోని 107 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ బాదాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ ఓ దశలో 57/6తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మహీ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ధోని రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో జార్ఖండ్ 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది..అయితే దురదృష్టం కొద్ది జార్ఖండ్ 5 పరుగులతో ఓటమి పాలైంది.