జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌‌ను మరో నెల పొడిగించింది. రాష్టంలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా కేసులలో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ తీసేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని, అందువల్లే మరో నెల పొడిగించడం జరిగిందని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. 

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఇప్పటికే కరోనా కేసులు 1.6 లక్షలు దాటేశాయి. మరణాలు కూడా 7వేలకు పైగా సంభవించాయి. కరోనా వ్యాప్తి ఈ స్థాయిలో ఉన్నందునే లాక్‌డౌన్‌‌ ను పొడిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.