రూ. 7లక్షల నల్లా బిల్లు ఎగ్గొట్టిన సీఎం!!

 

నల్లా బిల్లు ఎగవేతదారు జాబితాలో సీఎం పేరు చేరడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గతకొన్నేళ్లుగా నల్లా బిల్లు కట్టడం లేదట. అలా బకాయిలు పేరుకుపోయి పెండింగ్‌ బిల్లు ఏకంగా రూ. 7లక్షలకు చేరింది. దీంతో సీఎం బంగ్లాను ఎగవేతదారు జాబితాలో చేర్చించి బృహన్ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ).

ముంబయిలోని మలబార్‌హిల్స్‌ ప్రాంతంలో ఉన్న ఫడణవీస్‌ అధికారిక నివాసం ‘వర్షా’ బంగ్లా 2001 నుంచి నీటి బిల్లు చెల్లించట్లేదని సహ చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బీఎంసీ సమాధానమిచ్చింది. అప్పటి నుంచి పెండింగ్‌ బిల్లు రూ. 7,44,981కి చేరడంతో వర్షా బంగ్లాను ఎగవేతదారుగా ప్రకటించినట్లు పేర్కొంది. సీఎం తో పాటు 18 మంది మంత్రుల పేర్లను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లు తెలిపింది. వీవీఐపీల పెండింగ్‌ నల్లా బిల్లు ఏకంగా రూ. 8కోట్ల పైనే ఉందట. అయితే బిల్లు కట్టని సీఎం, మంత్రులపై బీఎంసీ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోనట్లు తెలుస్తోంది.