ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ మృతి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీలో దళితులకు అన్యాయం జరుగుతుందంటూ ఆత్మహాత్యాయత్నం చేసిన శ్రీనివాస్ ఇవాళ మృతిచెందాడు. ఈ నెల 3న కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాస్ మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు..అక్కడ గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. అతన్ని భౌతికకాయాన్ని భారీ భద్రత మధ్య స్వగ్రామానికి తరలించనున్నారు.