TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహానాడు విందు.. భలే పసందు!

Published on: Sat May 28, 2022 11:49AM

తెలుగుదేశం మహానాడుకు వచ్చిన ప్రతినిథుల కోసం ఏర్పాటు చేసిన విందు భలే పసందు అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగిన మహానాడుకు వచ్చిన అతిధుల కోసం ఆహార కమిటీ అద్భుతమైన మెనూ సిద్ధం చేసింది.

తొలి రోజు మధ్యాహ్న భోజనం లోకి యాపిల్ హల్వా, జిలేబీ, అజ్వాన్ పకోడి, వెజిటేబుల్ బుల్లెట్, కొబ్బరి అన్నం, కడాయి వెజిటేబుల్ కుర్మా, రైతా, మామిడికాయ పప్పు, వంకాయ ఫ్రై, ములక్కాడ బీన్స్ కర్రీ, బీరకాయ శెనగపప్పు కూర, దోసకాయ, వంకాయ చెట్నీ, సాంబారు, పచ్చిపులుసు, మెంతి మజ్జిగ, అన్నం, పెరుగు ఐస్ క్రీమ్ సర్వ్ చేశారు, అప్పడాలు, చిప్స్ అదనం.

ఇక రాత్రి భోజనంలోకి సేమ్యా కేసరి, అరటికాయ భజ్జీ, టమోటా పప్పు, బంగాళదుంప ఫ్రై, మిక్సుడ్ వెజిటబుల్ కర్రీ, దొండకాయ చట్నీ, పప్పుచారు, అప్పడాలు, వడియాలు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు సర్వ్ చేశారు. ఇక 28వ తేదీ అంటే శనివారం ఉదయం అల్పాహారంగా నేరేడు హల్వా, ఇడ్లీ, వడ, పొంగల్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యి, పాంబార్ సర్వ చేశారు.

ఇక మధ్యాహ్నం లంచ్ కోసం   చక్కెర పొంగలి, తాపేశ్వరం కాజా, మసాల వడ, మిర్చి బజ్జీ ,వెజిటబుల్ బిర్యానీ, వెజ్ జైపూర్ కుర్మా, రైతా, దోసకాయ పప్పు,  బెండకాయ కొబ్బరి ఫ్రై, అరటికాయ గ్రేవీ కర్రీ, గోంగూర ఉల్లిపాయ చట్నీ, మిక్సెడ్ వెజిటబుల్ చట్నీ, డైమండ్ చిప్స్, అప్పడాలు, సాంబారు, పచ్చిపులుసు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు, ఐస్ క్రీమ్ సర్వ్ చేయనున్నారు.