పార్టీని అణచివేసేందుకు ప్రయత్నిస్తే రెచ్చిపోతాం: చంద్రబాబు
Published on: Mon Apr 23, 2012 3:20PM
ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేస్తే మీకున్న అభ్యంతరమేమిటని చంద్రబాబునాయుడు పోలీసు అధికారులను ప్రశ్నించారు. ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఎస్పీ కార్తికేయపై మండిపడ్డారు.తన పోరాటం పోలీసుల మీద కాదని, ప్రభుత్వం మీద అని ఆయన చెప్పారు. ఎస్పీ కాంగ్రెసు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.తమ పార్టీని అణచివేసేందుకు ప్రయత్నిస్తే రెచ్చిపోతామని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా మద్యం సిండికేట్లపై చర్య తీసుకునే వరకు వదిలేది లేదని ఆయన అన్నారు.


