TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో పోలీసు కాల్పులు.. పాలమూరు యువకుడి మృతి

Published on: Fri Sep 19, 2025 10:28AM

అమెరికాలో మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు పోలీసు కాల్పులలో మరణించాడు. మహబూబ్ నగర్  రామయ్యబౌలికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ తొమ్మిదేళ్ల కిందట అంటే 2016లో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాంటాకార్లలో ఉంటున్నాడు.   ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, నిజాముద్దీన్  ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత, పదోన్నతి పొందిన అతను కాలిఫోర్నియాకు వెళ్లాడు.

అక్కడ ఈ నెల 3వ తేదీన తన రూమ్ మేట్ తో గొడవపడిన నిజాముద్దీన్ ను అదే రోజు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అక్కడి పోలీసుల కథనం ప్రకారం సెప్టెంబర్ 3 తెల్లవారుజామున ఇరుగుపోరుగు వారి నుంచి ఫోన్ లో అందిన ఫిర్యాదు మేరకు శాంతాక్లారా పోలీసులు నిజాముద్దీన్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంట్లో గొడవపడుతున్న శబ్దాలు వినిపించడంతో పోలీసులు లోనికి వెళ్లారు. అక్కడ నిజాముద్దీన్ అతడి రూమ్మేట్ పై కత్తితో దాడి చేస్తుండటం గమనించిన పోలీసులు వారించారు. అయినా వినకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ మరణించాడు.  

ఇక నిజాముద్దీన్ తల్లిదండ్రులైతే  తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ ను  పోలీసులు కాల్చి చంపారని, ఆ విషయం నిజాముద్దీన్ రూమ్మేట్ ద్వారా తమకు తెలిసిందని అంటున్నారు.  ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవ తీసుకుని వీలైనంత త్వరగా తమ కొడుకు మృతదే హాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరిం చాలని కోరారు.