TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల వేళ కండువాలు మారుస్తున్న నేతలు

Published on: Thu Mar 8, 2012 11:23AM

బెంబేలెత్తిపోతున్న అభ్యర్ధులు
మహ
బూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ సెగ్మెంట్లలో ద్వితీయ శ్రేణి నాయకులు, అసంతృప్తులు పార్టీ అధినేతలను, పోటీ చేస్తున్న అభ్యర్ధులను బెంబేలెత్తిస్తున్నారు. తమ డిమాండ్లను ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ నేరవేర్చుకోలేమన్న ఆలోచనలో ఉన్న కొందరు నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగుతుండటం అన్ని పార్టీలను కలవరపరుస్తున్నది. కొన్నిచోట్ల అధినేతలు ఇస్తున్న హామీతో కొందరు సంతృప్తి పడుతున్నప్పటికీ, మరికొందరు మాత్రం అలా కుదరదు అంటున్నారు.పోలింగ్ లోగానే తమకు ఏదో ఒక లబ్ది చేకూర్చితేనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాము లేకపోతే పార్టీలు మార్చేస్తామని బెదిరంచడమే కాకుండా అన్నంత పనీ చేసేస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒకప్పుడు టిడిపిలో వున్న మాజీ ఎమ్మెల్యే మధుసూదనరావు ఇటీవల వరకు వైయస్సార్ కాంగ్రెస్ లో ఉండి మళ్ళీ హఠాత్తుగా తెలుగుదేశం గూటిలోకి చేరుకున్నారు. వైయస్సార్ పార్టీనుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాగర్ కర్నూల్ లో మాజీ ఎమ్మెల్యే వి.ఎన్.గౌడ్ కుమారుడు శరత్ బాబు ఎన్నికల వేళ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు. గతంలో ఆయన డిసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. టిఆర్ ఎస్ నాయకుడు హన్వాడ మండల మాజీ అధ్యక్షుడు నరేందర్, టిఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు మున్నూరు రవి తదితరులు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరాలని నిర్నయించుకన్నారు. ఇదే మండలానికి చెందిన టిడిపి నాయకుడు జనార్ధన్ గౌడ్ తన అనుచరులతో కొద్దిరోజుల క్రితం తెలంగాణా నగారా సమితిలో చేరారు. మహబూబ్ నగర్ మాజీ ఎంపిటి టిడిపి నుంచి టిఆర్ ఎస్ లో చేరారు. నేతలు హఠాత్తుగా  వేసుకున్న కండువాలను తీసివేసి కొత్త కండువాలను వేసుకుంటుండటంతో అన్ని పార్టీల అధినేతలు ఇబ్బందులు పడుతున్నారు. వీరిని బుజ్జగించడానికి నానా తంటాలు పడుతున్నారు.