కొల్లాపూర్ కాంగ్రెస్ కోటకు బీటలు?
Published on: Tue Mar 6, 2012 11:42AM
మ
హబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జూపూడి కృష్ణారావుకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి మంత్రి కూడా అయ్యారు. తెలంగాణా వాదం పేరుతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు గట్టి బీటలే పడ్డాయి.
కొల్లాపూర్ నియోజకవర్గం 1952లోఏర్పాటైంది. నాటినుంచి పాలకులు మారుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి మాత్రం పెద్దగా జరగలేదు. 1952లో పిడిఎఫ్ అభ్యర్ధిగా వామపక్షాలు బలపర్చిన రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగదాసు 1,342 ఓట్ల తేడాతో సిపిఐ అభ్యర్ధి జి. రావును ఓడించారు.1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి బి. నర్సింహారెడ్డి రంగదాసు పై 1.572 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగదాసు 1,342 ఓట్ల తేడాతో సిపిఐ అభ్యర్ధి జి.రావును ఓడించారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి బి.నర్శింహారెడ్డి రంగదాసుపై 1.572 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1972లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన రంగదాసు కొత్త వెంకటేశ్వరరావుపై 3,556 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1978లో కొత్త వెంకటేశ్వరరావు రంగదాసుపై 14వేల మెజారిటీతో గెలుపొందారు. 1983లో కొత్త వెంకటేశ్వరరావు టిడిపి కి చెందిన వికె రెడ్డిపై సుమారు 13వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1985లో కొత్త వెంకటేశ్వరరావు సిపిఐ అభ్యర్ధి సురవరపు సుధాకరరెడ్డిపై 2,499 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన మరోసారి సుధాకర్ రెడ్డిని 9,159 ఓట్ల తేడాతో ఓడించారు.1994 లో కె. మధుసూదనరెడ్డి కొత్త రామచంద్రారెడ్డి కొత్త రామచంద్రారెడ్డిపై 33,774 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1999లో జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), మధుసూదనరావు (టిడిపి)పై 5,304 ఓట్ల తేడాతో విజయం సాధించారు.2004, 2009 ఎన్నికల్లో కూడా జూపల్లి ఇదే నియోజకవర్గం నుంచే గెలుపొందారు.


